రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట విద్యార్థుల ప్రతిభ

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేటటౌన్‌ : పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ సాంఘీక శాస్త్రం ఫోరం సంయుక్తంగా హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ కమిటీ పోటీల్లో సూర్యాపేట జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబరిచి మూడు బహుమతులు అందుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డీఈఓ అశోక్‌ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో 23 జిల్లాల విద్యార్థులు పాల్గొనగా అంతర్జాతీయ అంశాలపై చర్చలు, ప్రసంగాలలో మునగాల టీజీఎంఎస్‌కు చెందిన హేమహాసిని, అనాజిపురం టీజీఎంఎస్‌కు చెందిన విరాట్‌ సూర్య, నూతనకల్‌ పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన జి.సాత్విక్‌ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ ఎ.హరికృష్ణ, సాంఘీక శాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షుడు వేముల సైదులు, గౌరవ అధ్యక్షుడు యడవల్లి జానయ్య, ఉపాధ్యక్షుడు గుర్రాల సోమయ్యగౌడ్‌, ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్‌, ఆర్థిక కార్యదర్శి సుదర్శన్‌రావు పాల్గొన్నారు.

అభినందించిన డీఈఓ అశోక్‌

Advertisement
 
Advertisement
Advertisement