సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరస నగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న దేశవ్యాప్త పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు జిల్లా, పట్టణ, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. బంద్‌కు సంబంధించిన సమాచారాన్ని సోమవారం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇతర అధికారులకు ముందస్తుగా అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అక్రమ ఈ ఫార్మసీల వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కోవిడ్ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్ జీఎస్‌ఆర్ 220ను ఉపసంహరించుకోవా లని కోరా రు. కార్పొరేట్ సంస్థల అనైతిక డిస్కౌంట్లను అరికట్టేందుకు లెవెల్ ఫ్లేయింగ్ ఫీల్డ్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బంద్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సూర్యాపేటలోని బొడ్రా యి బజార్‌లో శ్రీ వినాయక మెడికల్ షాపు, పీఎస్‌ఆర్ సెంటర్‌లోని వేదశ్రీ మెడికల్ షాపు, ఎంజీ రోడ్‌లో కార్తికేయ మెడికల్ షాపు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యామ ప్రభాకర్, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముశం హరిప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపగాని గిరిగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి లింగయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


