సూర్యాపేటటౌన్ : పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రజ లకు అందుబాటులో ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా, వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
డీఎస్పీ కార్యాలయంలో...
సూర్యాపేట డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి భరోసా కల్పించారు. ప్రతి సోమవారం డివిజన్ స్థాయి పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.


