కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం తప్పదు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం తప్పదు

Apr 19 2026 7:23 AM | Updated on Apr 19 2026 7:23 AM

నేరేడుచర్ల : మహిళా బిల్లు వీగిపోయేలా చేసిన కాంగ్రెస్‌ పార్టీకి, ఇండియా కూటమికి రాబోయే రోజుల్లో మహిళలు తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. మహిళా బిల్లు విషయంలో ఇండియా కూటమి వైఖరిని నిరిస్తూ శనివారం మండల కేంద్రంలోని జడ్చర్ల– భద్రాచలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాహుల్‌గాంధీ నాయకత్వంలోని ఇండియా కూటమి నాలుగు దశాబ్ధాలుగా మహిళా బిల్లును పెండింగ్‌లో పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు పెడితే కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకోవడం దురదుష్టకరమన్నారు. దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు కొణతం నాగిరెడ్డి, చింతకుంట్ల రాజేష్‌రెడ్డి, నాయకులు తాళ్ల నరేందర్‌రెడ్డి, సంకలమద్ది సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, నాగయ్య పాల్గొన్నారు.

ఫ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement