సూర్యాపేట అర్బన్ : ఉపాధిహామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20, 21 తేదీలలో ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక పోరాటాలతో సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసోతందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, జంపాల స్వరాజ్యం, పోసనబోయిన హుస్సేన్, నాయకులు సిరికొండ శ్రీనివాస్, సోమపంగ జానయ్య పాల్గొన్నారు.


