పాలిటెక్నిక్‌, ఆర్‌జేసీలో ఉచిత కోచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌, ఆర్‌జేసీలో ఉచిత కోచింగ్‌

Apr 19 2026 7:23 AM | Updated on Apr 19 2026 7:23 AM

సూర్యాపేటటౌన్‌ : పాలిటెక్నిక్‌, ఆర్‌జేసీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాసే విద్యార్థులకు అక్షర ఫౌండేషన్‌ సూర్యాపేట ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ యాస రాంకుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం ఫౌండేషన్‌ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకున్న తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు కోచింగ్‌కు అర్హులని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని, ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు పాల స్వర్ణలత సెల్‌ : 9000305079 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. సమావేశంలో అక్షర ఫౌండేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పు నాగయ్య, రుద్రంగి కాళిదాసు, సభ్యులు మందడి రమాదేవి, వీరారెడ్డి, నరాల తిరుమలరెడ్డి, చొల్లేటి ఉపేంద్రాచారి, సుభాష్‌ చంద్రబోస్‌, బత్తుల ఉపేందర్‌, పాల్వాయి వెంకన్న పాల్గొన్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌ నివారణ

గరిడేపల్లి : హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రాకుండా నివారించవచ్చని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ కోటిరత్నం అన్నారు. శనివారం గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. 15 సంవత్సరాలలోపు బాలికలందరూ తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. పుట్టిన ప్రతి బిడ్డకు ప్రభుత్వం సూచించిన వ్యాధి నిరోధక టీకాలు అందేలా చూడాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కూడా ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీకా వేయించుకునే బాలబాలికలు తప్పనిసరిగా తమ తల్లిదండ్రులు వెంట తీసుకురావాలని సూచించారు. ఆమె వెంట మండల వైద్యాధికారి నరేష్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ తీగల నర్సింహ, యశోద, సురేష్‌, రేణుక ఉన్నారు.

డీఐఈఓగా సులోచన రాణి

సూర్యాపేటటౌన్‌ : జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారిగా బి.సులోచన రాణి శనివారం బాధ్యతలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ఆమె పదోన్నతిపై సూర్యాపేట డీఐఈఓగా వచ్చారు. సులోచన రాణిని వివిధ కళాశాలల ప్రిన్సి పాల్స్‌, అధ్యాపకులు, వివిధ సంఘాల నాయకులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

రైతుల ప్రయోజనానికే వ్యవసాయ చట్టాలు

పెన్‌పహాడ్‌ : రైతుల ప్రయోజనం కోసం వ్యవసాయ చట్టాలు ఉన్నాయని మొదటి అదనపు జిల్లా జూనియర్‌ సివిల్‌ జడ్జి అపూర్వ రవళి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాలు, సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నెముక అని ఆర్థిక పరమైన సమస్యలతో రైతులు ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. రైతుల కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని తెలుసుకొని ఉపయోగించుకోవడం ద్వారా ప్రయోజనం పొందాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజశేఖర్‌రెడ్డి, ఏఈ అనిల్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నూకల సుదర్శన్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ పాసాల బాలరాజు, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీ పత్తిపాక రాధాకృష్ణ, సభ్యులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement