భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఎండ తీవ్రత అమాంతం పెరగడంతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటల దాటితే సూర్యుడు తన ప్రతా పం చూపుతుండడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శనివారం జిల్లాలోని ఐదు మండలాల్లో 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సైతం 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. పట్టణాలే కాకుండా గ్రామీ ణ ప్రాంతాల్లోనూ ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో రైతులు, కూలీలు అవస్థలు పడుతున్నారు.
ఐదు మండలాల్లో అధికంగా..
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జిల్లా అంతటా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా గరిడేపల్లిలో 43.4 డిగ్రీలు, అత్యల్పంగా నడిగూడెంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మేళ్లచెరువులో 43.3, తిరుమలగిరిలో 43.2, మద్దిరాలలో 43.1, చిలుకూరులో 43.1 చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
జిల్లాలో వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పాటు గాలిలో తేమశాతం తగ్గి పోవడంతో ఉక్కపోత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు ఎండలోనే పనులు చేయాల్సిన పరిస్థితి ఉండడంతో వేడిని తట్టుకోలేక పోతున్నారు. ప్రస్తుతం వరి కోతలు పూర్తికాగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మిరప తోటలు ఏరేందుకు వెళ్తున్న కూలీలు సైతం ఎండవేడికి అల్లాడుతున్నారు. మధ్యా హ్నం వేళల్లో సూర్యాపేటలోని ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఫ గరిడేపల్లిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత
ఫ జిల్లా అంతటా 40 డిగ్రీలకు
పైగానే నమోదు
ఫ ఎండవేడికి అల్లాడుతున్న జనం


