ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలి

Apr 19 2026 7:23 AM | Updated on Apr 19 2026 7:23 AM

సూర్యాపేటటౌన్‌ : రోడ్డు భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రజలు ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ నర్సింహ సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక, అరైవ్‌ అలైవ్‌లో భాగంగా పోలీసు సిబ్బంది శనివారం జిల్లా కేంద్రంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి ప్రారంభమై ర్యాలీ కోర్టు చౌరస్తా, పీఎస్‌ఆర్‌ సెంటర్‌, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, ఎంజీ రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాట్లు తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేసి సూర్యాపేటను ప్రమాదరహిత జిల్లాగా తీర్చి దిద్దుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement