మునగాల : రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చేటప్పుడు తాలు, తేమ శాతం లేకుండా చూసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి సూచించారు. మండలంలోని బరాఖత్‌గూడెంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులను సీరియస్ ప్రకారం రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతిరోజు ధాన్యం తేమశాతాన్ని పరీక్షిస్తూ, నాణ్యత, తేమశాతం కలిగిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏఓ బుంగా రాజు, క్లస్టర్ ఏఈఓ మహిత, కేంద్రం నిర్వాహకులు గోపి, రైతులు ఉన్నారు.
ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి


