లక్ష్మీనరసింహుడికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీనరసింహుడికి విశేష పూజలు

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాభందనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఇన్‌చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement