బడికి దూరంగా 162 మంది | - | Sakshi
Sakshi News home page

బడికి దూరంగా 162 మంది

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

చిలుకూరు : చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక కొందరు పేద విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. మాధ్యమిక విద్య కూడా పూర్తి చేయలేకపోతున్నారు. వీరిలో అధిక శాతం మంది గ్రామీణ విద్యార్థులు చివరకు బాల కార్మికులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో పది, ఇంటర్‌ విద్యాభ్యాసం పూర్తిచేయలేని వారిని గుర్తించేందుకు విద్యా శాఖ ఇటీవల సర్వే చేపట్టింది. జిల్లాలోని అన్ని మండలాల్లో సీఆర్పీలతో సర్వే నిర్వహించి బడిబయట పిల్లలను గుర్తించారు.

6–14 ఏళ్లలోపు వారే ఎక్కువ..

జిల్లాలోని 23 మండలాల్లో చేపట్టిన సర్వే ద్వారా బడికి దూరమైన 6–14 ఏళ్లలోపు వారు అధికంగా 135 మంది ఉన్నట్టు గుర్తించారు. అలాగే 15 నుంచి 19 ఏళ్లలోపు వారు 27 మంది ఉన్నారు. ఈ రెండు కేటగిరీల్లో మొత్తంగా 162 మంది చదువుకు దూరంగా ఉంటున్నారు. వీరిని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి సమీప పాఠశాలలు, కళాశాలల్లో పది, ఇంటర్‌ తరగతుల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వృతి విద్యా కోర్సులపై ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత పకడ్బందీగా..

జిల్లాలో 23 మండలాల్లో 950 ప్రభుత్వ, 18 కస్తూ ర్బాలు, 9 ఆదర్శ పాఠశాలలు, 15 ఎయిడెడ్‌, 25 గురుకులాలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చదువుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నా బడిబయట పిల్ల లను మాత్రం పూర్తిస్థాయిలో బడిలో చేర్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా సర్వే నిర్వహించి ముందస్తుగా బడిబయట పిల్ల లను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీరిలో 14 ఏళ్లు నిండిన వారికి ఓపెన్‌ టెన్త్‌ ప్రవేశం కల్పిస్తారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ.2 వేలు ప్రోత్సాహక నగదు బహుమతి అందజేస్తారు. గుర్తించిన బడిబయట పిల్లలను వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ పాఠశాలల్లో చేర్పిస్తామని డీఈఓ అశోక్‌ తెలిపారు.

ఫ బడిబయటి పిల్లలను

గుర్తించిన విద్యా శాఖ

ఫ 6 –14 ఏళ్లలోపు వారు 135 మంది

ఫ 15–19 ఏళ్లు ఉన్నవారు 27

ఫ వీరందరినీ బడిలో

చేర్పించేలా సన్నాహాలు

Advertisement
 
Advertisement
Advertisement