కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌తో రైతులకు ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌తో రైతులకు ప్రయోజనం

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

మోతె : కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ (వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం)తో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఐసీఏఆర్‌–నార్మ్‌ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌) ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ బాలకృష్ణ అన్నారు. మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక పథకం కింద ఏర్పాటు చేసిన కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. షెడ్యూల్డ్‌ కులాల రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం పలువురు రైతులకు అద్దె కింద పార, కొడవలి, కల్టివేటర్‌ తదితరాలను అందజేశారు. ఈ పథకం ద్వారా రైతుల ఉత్పాదకత పెరగడంతో పాటు ఆదాయం మెరుగవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బొర్ర వెంకటేష్‌, నార్మ్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.నిర్మల, డాక్టర్‌ కులదీప్‌చౌదరి, డాక్టర్‌ సుప్రియ, శేఖర్‌రెడ్డి, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు నరేష్‌, కిరణ్‌, ఏడీఏ ప్రశాంతి, ఏఓ అరుణ, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement