మునగాల : అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు విద్యా నైపుణ్యాలు పెంపొందించేందుకు సిబ్బంది కృషిచేయాలని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు సూచించారు. శుక్రవారం మండలంలోని నర్సింహులగూడెంలో అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రాథమిక విద్యతో పాటు కథలు చెప్పడం ద్వారా పూర్వ ప్రాథమిక విద్య ఆవశ్యకత, భాషా నైపుణ్యం అభివృద్ధిపై వివరించారు. తల్లిదండ్రులకు పలు అంశాలకు సంబంఽధించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎక్స్‌టెన్షన్ అధికారి జి.స్వర్ణలత, అంగన్‌వాడీ టీచర్లు సృజనరాణి, కరుణ, జయమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మామిడాల అరవింద్, చిన్నారుల తల్లిదండ్రులు, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు.
ఫ జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు


