జిల్లా మొదటి అదనపు జడ్జిగా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జిల్లా మొదటి అదనపు జడ్జిగా బాధ్యతల స్వీకరణ

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

చివ్వెంల (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తిగా పి.శివరామ్‌ ప్రసాద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్‌ నాలుగు నెలల క్రితం బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లారు. దీంతో అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉన్నది. కాగా ఆదిలాబాద్‌ జిల్లా కోర్టులో మొదటి అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న శివరామ్‌ ప్రసాద్‌ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పీపీలు నాతీ సవీందర్‌ కుమార్‌, కోణం రఘురా మయ్య, డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ సుంకరబోయిన రాజు, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌ కుమార్‌, కె.ప్రియదర్శిని, లైజన్‌ ఆఫిసర్లు గంప ల శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, పోలీస్‌ సిబ్బంది పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement