ప్రజా సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

కోదాడ రూరల్‌ : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. గురువారం కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత గంజాయి వంటి చెడు వ్యసనాల బారిన పడకుండా దృష్టిసారించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీహెచ్‌.సూర్యనారాయణ, ఎంపీడీఓ ఇసాక్‌హుస్సేన్‌, తహసీల్దార్‌ వాజిద్‌అలీ, ఏడీఏ ప్రశాంతి, ఏఓ రజిని, పీఆర్‌ ఏఈ రాము, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రవి, ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, ఎంపీఓ రాంబాబు, వివిధ గ్రామాల సర్పంచులు కొత్త గురవయ్య, పోతురాజు సత్యనారాయణ, పాలకి సురేష్‌, మందుల నాగయ్య, బాబ్జీ, భవాని, కుటుంబరావు, సంధ్య, గురవమ్మ, శిరీషా, తులశమ్మ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement