నాణ్యతా ప్రమాణాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

కోదాడ : కోదాడ పట్టణంలో రూ.26 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణంలో నాణ్యతప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. గురువారం కోదాడ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. వైద్యశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం వైద్యశాలలో వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ కోదాడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హజ్‌ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ రమాదేవి, డీసీహెచ్‌ఎస్‌ చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌ ధశరథనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement