మార్కెట్‌లో కొందాం.. | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో కొందాం..

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం

కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కు

ఆవుదూడకు ఆర్థోపెడిక్‌ సర్జరీ

తిరుమలగిరి (తుంగతుర్తి) : రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న కొందరు వ్యాపారులు దానిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంతో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రాత్రి వేళల్లో ఈ అక్రమ దందా కొనసాగుతోంది. తిరుమలగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వరి కోతలు పూర్తి కావడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు అధికంగా ధాన్యం వస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకే మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొంత మంది వ్యాపారులు, దళారులు మార్కెట్‌లో తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ్క అదే ధాన్యాన్ని రైతుల పేరుతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు.

తక్కువ ధరకే కొనుగోలు

ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరను క్వింటాకు ఏ గ్రేడ్‌కు రూ.2,389, బీ గ్రేడ్‌కు రూ.2,369గా నిర్ణయించింది. అయితే తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు భారీగా ధాన్యం రావడంతో దళారులు, వ్యాపారులు రైతులకు క్వింటాకు రూ.1500 నుంచి రూ.1600లకే కొనుగోలు చేస్తున్నారు. ధాన్యాన్ని ట్రాక్టర్లు, లారీల ద్వారా అర్ధరాత్రి వేళ్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో కాంటాలు ప్రారంభం కాకున్నా సదరు దళారులు ముందస్తుగానే కేంద్రాలకు తరలిస్తున్నారు. కొంతమంది రైతుల పేరుతో ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయిస్తూ క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు లాభాలు ఆర్జిస్తున్నారు.

ప్రతి సీజన్‌లోనూ ఇలాగే..

కొంత మంది వ్యాపారులు కొన్ని సంవత్సరాలుగా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో ఈ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌ యార్డులో గతంలో ప్రభుత్వం హాకా ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. అయితే దళారులు రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కందులు కొనుగోలు చేసి హాకా కేంద్రంలో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మారు. ఇలా ప్రారంభమైన వీరి వ్యాపారం ధాన్యానికి కూడా విస్తరించింది. ప్రతి సీజన్‌లో మార్కెట్‌లో తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం పరిపాటిగా మారింది. వ్యాపారులు అధికారులతో కుమ్మకై ్క ఈ దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.20 వేల నుంచి రూ.25 వేల లాభం వస్తుండటంతో ప్రతిరోజు 5 నుంచి 10 ట్రాక్టర్ల ధాన్యాన్ని మార్కెట్‌ నుంచి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. దాంతో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మద్దతు ధరను దళారులు, వ్యాపారులు కాజేస్తున్నారు. ఈ అక్రమ దందాపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి అర్ధరాత్రి వేళల్లో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. అలా ఎవరు చేసినా కేసులు నమోదవుతాయి. ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం.

–సురేష్‌, మార్కెట్‌ కార్యదర్శి

ఫ ఆరు గంటలు శ్రమించి చికిత్స చేసిన కోదాడ పశువైద్యులు

దళారుల ధాన్యం దందా

ఫ రాత్రి వేళల్లో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులు

ఫ మద్దతు ధర, బోనస్‌ కాజేసేందుకు యత్నం

ఫ కొన్నేళ్లుగా కొనసాగుతున్నా పట్టించుకోని అధికారులు

రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించడం వల్ల లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు. సదరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో వ్యాపారులు కుమ్మకై ్క ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దాంతో పాటు మార్కెట్‌లో సన్న రకం ధాన్యాన్ని సైతం తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం ద్వారా మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న క్వింటాకు రూ.500 బోనస్‌ను కూడా స్వాహా చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement