ప్రాణాలు తీస్తున్న అతివేగం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న అతివేగం

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

సూర్యాపేట టౌన్‌ : అతివేగం, అజాగ్రత్త వల్లే ద్విచక్ర వాహనదారులు అధికంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల ప్రమాద సమయంలో తలకు గాలయాలై మృతి చెందుతున్నారు. బైక్‌లు నడిపేవారు హెల్మెట్‌ ధరిస్తే ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఈ విషయమై పోలీసులు అవగాహన కల్పిస్తూ..హెల్మెంట్‌ లేకుండా బైక్‌ నడిపితే జరిమానాలు విధిస్తున్నా.. హెల్మెట్‌లు కూడా నాణ్యమైన ఐఎస్‌ఐ మార్కు కలిగినది ధరించాలని చెబుతున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

అతివేగం.. నిర్లక్ష్యం వల్లే..

జిల్లాలో జరుగుతున్న మొత్తం ప్రమాదాలు, మరణాల్లో సగానికిపైగా బైక్‌ ప్రమాదాలే ఉంటున్నాయి. అయితే ఇందులో హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల తలకు తీవ్రగాయాలై మృతిచెందుతున్నారు. అయితే హెల్మెట్‌ ధరిస్తే 70 శాతం ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఒకవేళ హెల్మెట్‌ పెట్టుకున్నా దాని క్లిప్పులు సరిగా పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో అకస్మాత్తుగా ఊడిపోయి తీవ్ర గాయాలపాలవుతున్నారు. కొందరు మాత్రం కేవలం ట్రాఫిక్‌ చలానాలకు భయపడి మాత్రమే పోలీసులను చూసి హెల్మెట్‌ ధరిస్తున్నారు. ప్రతిఒక్కరూ ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లేటప్పుడు విధిగా హెల్మెట్‌ ధరిస్తే ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చు. మరికొంత మంది యువత మద్యం సేవించి నిర్లక్ష్యంగా అతివేగంగా బైక్‌లు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఏడాదిన్నర కాలంలో 777 ప్రమాదాలు

జిల్లా వ్యాప్తంగా ఏడాదిన్నర కాలంలో 777 ప్రమాదాలు జరగగా మొత్తం 278 మంది మృతిచెందారని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 390 బైక్‌ ప్రమాదాలు జరిగి 153 మంది మృతిచెందారు. ప్రమాదాల్లో దాదాపు 50 శాతం ప్రమాదాలు బైక్‌ ప్రమాదాలే జరుగుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు.

ప్రమాదాల వివరాలు..

హెల్మెట్‌ ధరించకపోవడం మరో కారణం

ఫ రోడ్డు ప్రమాద మృతుల్లో

దిచక్రవాహనదారులే అధికం

ఫ ఏడాదిన్నర కాలంలో జరిగిన బైక్‌ ప్రమాదాల్లో 153 మంది మృతి

ఫ ఆందోళన కలిగిస్తున్న

పోలీస్‌ గణాంకాలు

ఫ పోలీసులు ఫైన్‌ విధిస్తున్నా

మారని వాహనదారులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 6న అర్థరాత్రి జరిగిన బైక్‌ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తన పనులు ముగించుకొని ఇంటికి బైక్‌పై వెళ్తుండగా జిల్లా కేంద్రంలోని డీమార్ట్‌ సమీపంలో ఒక్కసారిగా కుక్క రావడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సదరు యువకుడు హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణం దక్కేదని పోలీసులు చెబుతున్నారు. ఇలా హెల్మెట్‌ ధరించకుండా అతివేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనదారులు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

సం. మొత్తం మృతులు బైక్‌తో మృతులు

ప్రమాదాలు

2025 622 230 316 131

2026 155 48 82 22

Advertisement
 
Advertisement
Advertisement