ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

హుజూర్‌నగర్‌ : విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్‌ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌లోని విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ల నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికులకు మద్దతు తెలిపి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లు తీర్చే వరకు సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.నకులుడు, ఎంవీఎన్‌ చార్యులు, పి. శ్రీనివాసరావు, బి.రామయ్య, బి.వేణు, డి.శంకర్‌, తిరుపతిరావు, సైదులు, హఫీజ్‌, వీరభద్రం, మట్టపల్లి, షణ్ముఖ, విద్యుత్‌శాఖ కార్మికులు పాల్గొన్నారు.

వరి కొయ్యలను కాల్చి వదిలేయవద్దు

హుజూర్‌నగర్‌ : వరి కొయ్యలను కాల్చిన వారు ఆ నిప్పును పూర్తిగా ఆర్పివేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పి.సుబ్బరామిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని అగ్నిమాపక కేంద్రంలో సిబ్బందితో కలిసి అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో మృతి చెందిన సిబ్బందికి సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పడు వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఫైర్‌ సిబ్బంది అగ్ని ప్రమాదాలు, పరికరాలు, నివారణ చర్యలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో లీడింగ్‌ ఫైర్‌ ఫైటర్‌ రవి బాబు, ఫైర్‌ సిబ్బంది జె.వెంకటేశ్వర్లు, ఎస్‌.నర్సింహారావు, రామారావు, వెంకటేశ్వర్లు, జి.సైదులు, సత్తయ్య, గురవయ్య పాల్గొన్నారు.

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు

రామగిరి (నల్లగొండ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలైన సీఓఈ, రెగ్యులర్‌ జూనియర్‌ కాలేజీలు, వృత్తి విద్య, సైనిక కళాశాలల్లో ఇంటర్‌లో చేరేందుకు ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌సీఓ ఎస్‌.విద్యావాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. rjcet.tela ngana.gov.in లేదా tgswreis.telanga na.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 15న ఉదయం 10 గం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.

మట్టపల్లిలో విశేష పూజలు

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం అర్చకులు స్వామి వారికి విషేష పూజలు నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతా భిషేకం చేపట్టారు. అనంతరం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి, సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను గరుఢ వాహనంపై అధిష్టించి ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఇన్‌చార్జి ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement