బుద్ధవనంలో కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ బృందం | - | Sakshi
Sakshi News home page

బుద్ధవనంలో కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ బృందం

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

నాగార్జునసాగర్‌: కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ చైర్మన్‌ ధర్మేంద్రకుమార్‌శర్మ, సభ్యులు గౌతం, గుల్షన్‌రాజు సోమావారం సాయంత్రం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. స్థానిక ఇంజనీర్లతో కలిసి బుద్ధవనంలోని జాతక వనం, స్థూపపార్కు తదితర ప్రాంతాలను పరిశీలించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్‌ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు. అనంతరం బుద్ధవనం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాసన వారిని సత్కరించారు. వారి వెంట ఎస్‌ఈ మల్లికార్జున్‌రావు, ఈఈ సీతారాం, డీఈ అశోక్‌, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ, నర్సింహ, విజయ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement