యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. సోమవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన పూజ చేపట్టారు. వివిధ పుష్పాలు, తులసీ దళాలతో స్వామివారిని లక్ష పుష్పాలతో అలంకరించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బందికి పుష్పాలను అందజేశారు.


