రైతులను ముంచుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులను ముంచుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

కట్టంగూర్‌ : ఐకేపీ కేంద్రాల్లో తాలు పేరుతో రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ముంచుతుందని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్‌ నాయకుల హవా నడుస్తుందని, రైతులను పట్టించుకునేవారు కరువయ్యారని ఆరోపించారు. రైతులు మరలా కేసీఆర్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి మార్కెట్‌లో పోసి రాత్రికి రాత్రే కాంటా వేసి పంపిస్తున్నారని ఆరోపించారు. రైతులు రోజుల తరబడి ఇబ్బందులకు గురువుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు ఇవ్వకుండా రైతుల సంఘాల పేరిట వేరే వారికి ఇవ్వటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నకిరేకల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. తాలు పేరుతో బస్తాకు 2 నుంచి 3 కిలోలు అధికంగా కాంటా వేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. రైతులను కొనుగోలు కేంద్రాల్లో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు పెరగటంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ అధికారుల నిఘా కొనుగోలు కేంద్రాలపై ఉండాలన్నారు. దళారీ వ్యవస్థను తొలగించేందుకు జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములుయాదవ్‌, అయిటిపాముల సర్పంచ్‌ బెల్లి సుధాకర్‌, పోగుల నర్సింహ, పెద్ది బాలనర్సింహ, పెద్ది మల్లేష్‌ ఉన్నారు.

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Advertisement
 
Advertisement
Advertisement