భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లిలో 18న నిర్వహిస్తున్న భూదాన వజ్రోత్సవాలకు హాజరుకావాలని సోమవారం హైదరాబాద్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వెదిరె రాంచంద్రారెడ్డి సేవాసమితి నాయకులు ఆహ్వానపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య మాట్లాడుతూ.. వజ్రోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత లవకుమార్, కొట్టం కరుణాకర్‌రెడ్డి, తడక యాదగిరి, కొమ్ము లక్ష్మణ్, కరగల్ల కుమార్, తొలుపునూరి కృష్ణ, పోతగల్ల నర్సింహ పాల్గొన్నారు.
బీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్ కల్పించాలి
దేవరకొండ : పార్లమెంట్‌లో మహిళా బిల్లుతో పాటు బీసీ మహిళలకు చట్టసభల్లో సబ్ కోటా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం దేవరకొండలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటే జనాభా దామాషా ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.


