ప్రయాణికులు ఉన్నచోట షెల్టర్‌ లేక.. | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులు ఉన్నచోట షెల్టర్‌ లేక..

Apr 11 2026 9:16 AM | Updated on Apr 11 2026 9:16 AM

ప్రయాణికులు ఉన్నచోట షెల్టర్‌ లేక..

అర్వపల్లి : సూర్యాపేట–జనగామ, నకిరేకల్‌–తానంచర్ల జాతీయ రహదారుల ప్రధాన కూడలి ప్రాంతమైన అర్వపల్లి వై జంక్షన్‌ వద్ద బస్‌షెల్టర్‌ లేక ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సుల కోసం గంటల తరబడి ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు. అర్వపల్లిలో జాజిరెడ్డిగూడెం రోడ్డులో హైవే వెంట గ్రామ శివారులో బస్‌షెల్టరు ఏర్పాటు చేయడంతో ఉపయోగం లేకుండా పోయింది. పర్సాయపల్లి, రామన్నగూడెంలో హైవే వెంట ఏర్పాటు చేసిన బస్‌షెల్టర్లు నిర్వహణలేక ధ్వంసం కావడంతో ప్రయాణికులకు ఉపయోగ పడడం లేదు. వాటిని కొందరు బైక్‌లు పార్క్‌ చేసుకోవడానికి వినియోగించుకుంటున్నారు. ప్రయాణికులు మాత్రం ఎండలో అవస్థలు పడుతున్నారు. వేల్పుచర్ల వద్ద హైవేపై, అడివెంల స్టేజీ వద్ద, నకిరేకల్‌ –తానంచర్ల హైవేపై సీతారాంపురం వద్ద బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement