సూర్యాపేటటౌన్ : ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి పాదాచారులు, వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సూర్యాపేట, కోదాడ పట్టణ ఇన్‌స్పెక్టర్‌లు, ట్రాఫిక్ పోలీస్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఆధునీకరించాలని, వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఎండాకాలంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ కళ్లద్దాలు, సమ్మర్ కిట్లు పంపిణీ చేశారు. సమావేశంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీనీవాస్‌రెడ్డి, సూర్యాపేట కోదాడ పట్టణ ఇన్‌స్పెక్టర్‌లు వెంకటయ్య, శివశంకర్, ట్రాఫిక్ ఎస్‌ఐలు సాయిరాం, అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


