సమస్యలు పరిష్కరించాలని విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మె | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మె

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

హుజూర్‌నగర్‌ : విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని విద్యుత్‌ ఆర్టిజన్ల సంఘం ఉమ్మడి జిల్లా కోకన్వీనర్‌ నకులుడు, డివిజన్‌ ప్రెసిడెంట్‌ వెంకటనరసింహాచార్యులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్త విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మెలో భాగంగా గురువారం హుజూర్‌నగర్‌లోని విద్యుత్‌ డీఈ కార్యాలయం ఎదుట నిర్వహించిన సమ్మెలో డివిజన్‌ పరిధిలోని ఆర్టిజన్లు పాల్గొన్నారు. ఈ సమ్మెలో వారు పాల్గొని మాట్లాడుతూ.. ఆర్టిజన్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు నిబంధనలు అమలు చేయాలని, విద్యార్హతను బట్టి ఆర్టిజన్లను జేఎల్‌ఎం, జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించాలని, ట్రెజరీ ద్వారా వేతనం ఇవ్వాలని కోరారు. మీటర్‌ రీడింగ్‌ తీసేవారికి కూడా న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్‌ కోకన్వీనర్‌ పి.మల్లయ్య, డివిజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.శ్రీనివాసరావు, నాయకులు తిరుపతిరావు, సైదులు, జితేందర్‌రెడ్డి, వీరభద్రం, ప్రసాద్‌, శివ, శేఖర్‌రెడ్డి మట్టపల్లి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement