అర్వపల్లి : ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. అర్వపల్లిలో బుధవారం నిర్వహించిన సీపీఎం నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేరళ సీఎం విజయన్‌ను విమర్శించడం తగదన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, పాత పింఛన్లను పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్‌రెడ్డి, మండల కార్యదర్శులు వజ్జె శ్రీనివాస్, వి.శ్రీనివాసులు, ఉప్పలయ్య, దేవరకొండ యాదగిరి, నాయకులు శిగ వెంకన్న, అవిలయ్య, సరోజన, లక్ష్మి, వెంకటేశ్వర్లు, అబ్బులు, సైదులు, యల్లయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జునరెడ్డి


