హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పక వేయించాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పక వేయించాలి

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

నూతనకల్‌ : వివిధ రకాల క్యాన్సర్‌లకు కారణమైన వైరస్‌ నుంచి బాలికలను రక్షించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను తప్పక వేయించాలని డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్‌, జననేంద్రియ మొటిమలు, ఇతర క్యాన్సర్ల నివారణకు వ్యాక్సిన్‌ సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు. వైరస్‌ బారిన పడకముందే టీకా వేయించుకుటే వందశాతం రక్షణ పొందవచ్చని చెప్పారు. ఆయన వెంట మండల వైద్యాధికారి అశ్రితారెడ్డి, సీహెచ్‌ఓ శరణ్‌నాయక్‌, వైద్యసిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement