ఆకట్టుకున్న ‘భారతీయం’ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘భారతీయం’

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

కోదాడ : వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను పురష్కరించుకొని కోదాడలోని తేజ విద్యాలయలో ఆదివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్‌లు వాడ్రేవు చినవీరభద్రుడు, డాక్టర్‌ చక్రపాణి, కోదాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎర్నేని కుసుమకుమారి, కౌన్సిలర్‌ చీమ నరేష్‌, మారసాని సోమిరెడ్డి, ఉపేంధర్‌రెడ్డి, పాఠశాల నిర్వాహకులు ఉస్తేల రమా సోమిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement