10 నుంచి అరుణోదయ రాష్ట్ర మహాసభలు | - | Sakshi
Sakshi News home page

10 నుంచి అరుణోదయ రాష్ట్ర మహాసభలు

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : ఈ నెల 10, 11 తేదీల్లో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి సైదులు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 52 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో సమాఖ్య దోపిడీ, పీడన, అసమానత, అణచివేతలకు వ్యతిరేకంగా డప్పుల దరువు మోగిస్తూ జైత్రయాత్ర సాగిస్తుందన్నారు. సంఘం సభ్యులు, మేథావులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర ఉమేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement