51 ఏళ్లకు ఒకే వేదికపైకి.. | - | Sakshi
Sakshi News home page

51 ఏళ్లకు ఒకే వేదికపైకి..

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

నేరేడుచర్ల : నేరేడుచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు 51 ఏళ్ల తరువాత ఒకే వేదికపైకి వచ్చారు. 1972 నుంచి 1975 వరకు 8, 9, 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం నేరేడుచర్లలోని అన్నపూర్ణ విశ్వేశ్వరాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆనాటి గురువులను సత్కరించారు. కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు కొణతం వెంకట్‌రెడ్డి, వి. వేలాద్రి, ఎంవైఎన్‌ చారి, పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్‌రెడ్డి, ఆకారపు వెంకటేశ్వర్లు, బాల సైదులు, నర్సింహారావు, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, నర్సిరెడ్డి, జానయ్య, రామారావు, కృష్ణకుమారి, సోమయ్య, జానకిరామారావు, సత్యనారాయణ రెడ్డి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement