భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సభ్యత్వాలు అధికంగా చేయించి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం బలోపేతానికి కార్యవర్గ సభ్యులంతా కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య కోరారు. శనివారం సూర్యాపేటలో జరిగిన ఆ సంఘం మండల నోడల్ యూనిట్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్యంపై విధివిధానాల రూప కల్పన జరుగుతుందని, వారం పదిరోజుల్లో జీఓ విడుదల కానుందని తెలిపారు. పీఆర్సీ అమలుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, ప్రధాన కార్యదర్శి దండా శ్యాంసుందర్‌రెడ్డి, కోశాధికారి హమీద్‌ఖాన్, మండల అధ్యక్షుడు సుదగాని నాగేశ్వర్‌రావు, కార్యదర్శి శనగల యాదగిరి, నాయకులు సుధాకర్, రవీందర్‌రెడ్డి, గాలి శ్రీనివాస్, దేవీరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


