కార్యకర్తలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటాం

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

సూర్యాపేట : బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ బీమా చెక్కులతో పాటు 86 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ బీమా రూ.2లక్షలు అందజేస్తున్న ఏకై క పార్టీ బీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు కార్యకర్తలను కాపాడుకోవడంలో కేసీఆర్‌ను మించిన వారే లేరన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఆ పార్టీ నాయకులు అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, సత్యనారాయణరెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement