కోదాడ : కోదాడ పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, పట్టణ ప్రజలు తమకు సహకరించాలని మున్సి పల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమబాబు కోరారు. కోదాడ అర్బన్ పార్కు దుస్థితిపై శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనం ప్రజాప్రతినిధులతో పాటు అధికారులలో చలనం తీసు కొచ్చింది. ఈ వార్తను చూసిన కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమబాబు ఉదయమే మున్సిపల్ అధికారలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 20 మంది కామాటీలతోపాటు మున్సిపల్ డీఈ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో పార్కు వద్దకు చేరుకొని దగ్గరుండి శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ రామినేని ఉదయశ్రీ, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్
ఎర్నేని కుసుమబాబు


