ఫిట్‌నెస్‌ నాయక్‌ | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ నాయక్‌

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

కాసింత కళాపోషణ..

ఆయన ఓ ప్రజాప్రతినిధి.. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఆయన ఎన్ని పనులున్నా.. రోజూ వ్యాయామం

మిస్‌ చేయరు. వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవంటున్నారు ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌.

కార్య కర్తలకు కూడా ఆయన ఇదే సూచిస్తారు.

ఆరోగ్యంపై ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ ప్రత్యేక శ్రద్ధ

సోషల్‌ మీడియాలో ఆయన ఫిట్‌నెస్‌ వీడియోలకు యూత్‌ ఫిదా

మితాహారం, ఆరు గంటలు నిద్ర ఆయన హెల్త్‌ సీక్రెట్‌

మిర్యాలగూడ : ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ తొలుత జాగింగ్‌ చేస్తారు. 16 రకాల యోగాసనాలను వేస్తారు. ముఖ్యంగా వజ్రాసనం, కపాలభాతి వంటి ఆసనాలు వేస్తారు. తరువాత వెయిట్‌ లిఫ్టింగ్‌, డిప్స్‌తోపాటు వాలీబాల్‌, కబడ్డీ ఆడుతారు.

చిన్నప్పటి నుంచే ..

ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌కు చిన్నప్పటి నుంచే క్రీడలతోపాటు వ్యాయామంపై ఆసక్తి. ఆయనతోపాటు ఇద్దరు కుమారులు సైతం నిత్యం వ్యాయామం చేస్తారు. శంకర్‌నాయక్‌ ఏదైనా పాఠశాలకు వెళ్లిన సందర్భంలో విద్యార్థులకు సైతం వ్యాయామం, శరీర దారుఢ్యానికి దోహదపడే అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇటీవల ఆయన వ్యాయామం చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో చూసిన యువత.. ‘ఫిట్‌నెస్‌ నాయక్‌’ అని కితాబిస్తున్నారు.

ఆహార నియమాలు ఇవే..

శంకర్‌నాయక్‌ ఉదయం అల్పాహారంగా జొన్న గటక, రాగి సంకటి తీసుకుంటారు. మధ్యాహ్నం మిత భోజనం, రాత్రి జొన్నరొట్టె మాత్రమే తీసుకుంటారు. మాంసాహారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మద్యానికి, ధూమపానానికి దూరంగా ఉంటారు. నిత్యం ఆరుగంటలు తప్పకుండా నిద్రిస్తానని ఆహారం, నిద్ర నియమాలు పాటిస్తుండడంతో తాను ఆరోగ్యంగా ఉంటున్నానని చెబుతున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా శంకర్‌నాయక్‌కు ఆసక్తి ఉంది. పాఠశాలలో చదివే రోజుల్లో నాటకాలు వేసేవారు. ఇటీవల శాసన

సభ్యులు, శాసనమండలి సభ్యుల సాంస్కృతికోత్సవంలో కట్టప్ప వేషధారణ

ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు

మంత్రుల అభినందనలు

అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement