ఉష్ణోగ్రతల వివరాలు
(డిగ్రీల సెల్సియస్‌లలో..)
సూర్యాపేటలో శనివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. వేసవి కాలం ప్రారంభమైన కొద్దిరోజులకే ఉష్ణోగ్రతలు పెరిగాయి. మూడు రోజులుగా జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ ఎండలు గతేడాదితో పోల్చితే ఎక్కువగానే ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా శనివారం సూర్యాపేట పట్టణంలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో భానుపురి ఒక్కసారిగా భగ్గుమన్నది. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండలు ముదరడంతో బోరుబావుల్లో జలాలు తగ్గిపోయి చాలావరకు పొలాలు ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
సాధారణానికి మించి..
జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. కాగా ఏప్రిల్, మే మాసాల్లో ఈ ఎండల తీవ్రత మాత్రం అధికంగానే ఉంటుంది. రెండోవారం నుంచే 35 డిగ్రీలకు చేరుకుని ఆ తర్వాత 40 డిగ్రీలకు అటుఇటుగా నమోదవుతోంది. అయితే మార్చి మొదటి వారంలోనే సాధారణానికి మించి మూడు డిగ్రీలు అధికంగా 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలంతా ఇదేవిధంగా ఎండల తీవ్రత ఉండగా.. శనివారం గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. 2025లో ఏప్రిల్ 7వ తేదీన 40.2 డిగ్రీలకు చేరగా.. ఈ వేసవిలో ముందుగానే శనివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండలను చూసిన జనం బెంబేలెత్తి పోతున్నారు.
ఉపశమనం కోసం..
వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మిరప తోటలు ఏరుతున్న వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల్లో రోజుకో డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రత, ఉక్కపోతకు ఇళ్లల్లోనూ వృద్ధులు, చిన్నారులు ఉండలేని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం 8గంటల వరకూ వాతావరణం చల్లబడి వర్షసూచన ఉన్నట్లు అనిపించినా.. మధ్యాహ్నం తర్వాత ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఎండల తీవ్రత పెరగడం, రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు ఉపశమనం పొందేందుకు ఇళ్లతో పాటు ఆఫీసుల్లో వేసవి నేస్తాలను సమకూర్చుకుంటున్నారు. ప్రధానంగా కూలర్లు, ఎయిర్ కండీషనర్‌ల (ఏసీ)ను రిపేర్ చేయించుకుంటున్నారు.
23
24
25
26
27
28
ఫ ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
ఫ మూడురోజులుగా
పెరిగిన ఎండ తీవ్రత
ఫ గతేడాదితో పోల్చితే
ముందుగానే భానుడి ప్రతాపం
తేది


