హాలియా : నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని శనివారం ఉదయం 22 దేశాల బౌద్ధమత ప్రతినిధులు సందర్శించనున్నారని బుద్ధవనం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఈ బృందంలో శ్రీలంక దేశ బౌద్ధమత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్‌సెనేవి, వియత్నాం బౌద్ధ సంఘం ఉపాధ్యక్షుడు తిచ్‌నహత్, శ్రీలంక దేశపు ఉన్నతస్థాయి పీఠాధిపతి అగ్గరహేరాక సపమహాతేరో, సౌత్‌కోరియాగ్లోబల్ పీస్ అంబాసిడర్ మున్‌యోగ్ జోలతోపాటు పలుదేశాల బౌద్ధప్రతినిధులు ఉంటారని వెల్లడించారు.
మట్టపల్లి ఆలయంలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామివారికి విశేష పూజలు, నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


