చౌటుప్పల్ : అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కోవాలంటే ముందుగా అవగాహన అవసరమని ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి, యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్‌రావు, ఎన్డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ దామోదర్‌సింగ్, ఆర్డదో వెలమ శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గల దివీస్ పరిశ్రమలో విపత్తులను ఎదుర్కొనే అంశాలపై జిల్లా స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించారు. రసాయన పరిశ్రమల్లో కెమికల్, గ్యాస్ లీకేజీలతో సంభవించే ప్రమాదాలను గుర్తించడం ఎలా.. గుర్తించాక స్పందించాల్సిన పద్ధతులను ప్రదర్శించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ప్రమాదాలను ఎలా నియంత్రించాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి నిజ జీవితంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవగాహన ఉంటే నష్టనివారణ చాలా సులువు అవుతుందని తెలిపారు. జిల్లాలో విపత్తులు సంభవించినప్పుడు ఏదో రూపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడంలో దివీస్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్ జంగయ్య, దివీస్ పరిశ్రమ భద్రతా విభాగం జనరల్ మేనేజర్ బాలకిషోర్, పరిపాలనా విభాగం జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రావు, దివీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఎన్. సాంబశివరావు, ఎన్. విశ్వనాథ్, మేనేజర్లు ఉమామహేష్, రంగారావు, లైజన్ ఆఫీసర్ కిషోర్‌కుమార్‌చౌదరి, ప్రతినిధులు శివప్రసాద్, గోపి పాల్గొన్నారు.
విపత్తుల నిర్వహణపై మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
ఫ పరిశ్రమల శాఖ డిప్యూటీ
చీఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి
ఫ చౌటుప్పల్ దివీస్ పరిశ్రమలో
ఎన్డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్


