బుద్ధవనం సందర్శించిన ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌ | - | Sakshi
Sakshi News home page

బుద్ధవనం సందర్శించిన ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌

Mar 27 2026 9:47 AM | Updated on Mar 27 2026 9:47 AM

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(పీసీసీఎఫ్‌) సి. సువర్ణ గురువారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా నెల్లికల్‌ వ్యూ పాయింట్‌ను వీక్షించారు. అనంతరం బుద్ధవనానికి చేరుకొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఎస్టేట్‌ మేనేజర్‌ రవిచంద్ర ఆమెను సత్కరించారు. టూరిజం గైడ్‌ సత్యనారాయణ బుద్ధవనం ప్రత్యేకతలను వివరించారు. ఆమె వెంట అమ్రాబాద్‌ అటవీ సీసీఎఫ్‌ సునీల్‌ హీరావత్‌, నల్లగొండ జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌, సాగర్‌ డీఎఫ్‌ఓ సంగీత, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

నకిలీ బ్రాండ్‌లతో బియ్యం సరఫరా..

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బ్రాండెడ్‌ బియ్యం వ్యాపారులు

మిర్యాలగూడ అర్బన్‌ : నకిలీ బ్రాండ్‌ల పేరుతో వివిధ రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేస్తూ బ్రాండెడ్‌ బియ్యం వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న మిర్యాలగూడ బియ్యం వ్యాపారి ఇంటిలో గురువారం ఢిల్లీ హైకోర్టు ప్రతినిధుల బృందం తనిఖీ చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి కొన్నేళ్లుగా పలు రకాల బ్రాండ్ల పేరుతో కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు బియ్యం సరఫరా చేస్తున్నాడు. అయితే, తమకు సరఫరా చేస్తున్న బియ్యం నకిలీ బ్రాండ్లుగా గుర్తించిన పలువురు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఫిర్యాదుపె స్పందించిన ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా అడ్వకేట్‌ జనరల్‌ను నియమించి తనిఖీలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం మిర్యాలగూడ వన్‌టౌన్‌ సీఐ నాగభూషణంను కలిసింది. స్థానిక రెడ్డీకాలనీలోని బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి నివాసంతో పాటు మరికొన్నిచోట్ల తనిఖీలు చేశారు. అంతే కాకుండా గోపికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసి నఖిలీ బ్రాండ్ల పేరుతో.. బియ్యం నింపే బస్తాలను ముద్రిస్తున్నారని గుర్తించారు. నకిలీ బ్రాండ్ల పేరుతో బియ్యం సరఫరా చేస్తున్న విషయం బయట పడటంతో మిర్యాలగూడ పట్టణంలో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement