ఖాతాలు అద్దెకు తీసుకుని
కోదాడ : సైబర్ నేరగాళ్లకు కోదాడ అడ్డాగా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన పలువురు యువకులు కోదాడలోని మూడు బ్యాంకులలో కరెంట్ ఖాతాలను తెరిచి వాటిని మ్యూల్ ఖాతాలుగా మార్చారు. (ఖాతాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడాన్ని మ్యూల్ ఖాతాలంటారు) వీటిని ఉపయోగించిన సైబర్ నేరగాళ్లు ఇతరుల ఖాతాలను డిజిటల్ అరెస్ట్ చేసి ఆ తరువాత ఆ ఖాతాల్లోని డబ్బులను
కొల్లగొట్టి తాము అద్దెకు
తీసుకున్న ఈ ఖాతాల్లోకి మరల్చడం
వెంటనే వాటిని డ్రా చేసుకొని నేరానికి పాల్ప డుతున్నారు. సైబర్ నేరాలపై ఇటివల ప్రభుత్వం ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ పేరిట తనిఖీలు నిర్వహించగా కోదాడలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 116 ఖాతాలు, ఇండియన్ బ్యాంక్‌లో 37,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 89 మ్యూల్ ఖాతాలను కనుగొన్నారు. పూర్తిస్ధాయిలో కోదాడ, పరిసర మండలాల్లోని బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహిస్తే మరికొన్ని ఇలాంటి ఖాతాలు బయటపడే అవకాశం ఉందని పలువురు బ్యాంకు అధికారులే అంటున్నారు. ఈ మూడు బ్యాంకులలో 242 ఖాతాలు తెరిచిన వారు 1,271 సైబర్ నేరాలతో లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ట్రేడింగ్ యాప్‌తో మొదలు పెట్టి..
కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం వల్లాపురం, సిరిపురం, మునగాల మండలం ఆకుపాములలో రెండు సంవత్సరాలుగా కొంత మంది యువకులు బినాన్స్ అనే ప్రైవేట్ ట్రేడింగ్ యాప్ ద్వారా ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వీరు దీని కోసం వీరు వల్లాపురం, సిరిపురం, ఆకుపాముల, అనంతగిరి, నడిగూడెం బ్యాంకులలో కరెంట్ ఖాతాలను తెరిచారు. ఆ తరువాత నెమ్మదిగా వీటిని మ్యూల్ ఖాతాలుగా మార్చి భారీగా కమీషన్ తీసుకోసాగారు. తమ బంధువులకు, మిత్రులకు ఈ ట్రేడింగ్, మ్యూల్ ఖాతాలను గురించి చెప్పడంతో వందల మంది ఈ విధంగా చేయసాగారు. విషయం తెలుసుకున్న పలు బ్యాంకులు వల్లాపురం, సిరిపుర, ఆకుపాముల గ్రామాలకు చెందిన వారికి ఖాతాలు ఇవ్వడానికి నిరాకరించడంతో వారంతా కోదాడలోని వ్యాపారం తక్కువగా ఉండే బ్యాంకులలో, కొత్తగా బ్రాంచీలు ఒపెన్ చేసే బ్యాంకులలో ఇలాంటి ఖాతాలను ఓపెన్ చేయడం ప్రారంభించారు. ఈ గ్రామాలకు చెందిన పలువురు సమీపంలో ఉన్న ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామలలో కూడా ఈ మ్యూల్ ఖాతాలను తెరిచారు. సైబర్ క్రైం పోలీసులు ఈ మూడు గ్రామాలలో పలు విడతలు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా వీరు మాత్రం మారడం లేదని ఆయా గ్రామాల పెద్దలు అంటున్నారు. ఇటీవల పోలీసులు కేసులు నమోదు చేయడంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లి న్యాయవాదుల ద్వారా రాష్ట్ర హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
కోదాడ నియోజకవర్గ పరిధిలోని వల్లాపురం, ఆకుపాముల, సిరిపురం గ్రామాలకు చెందిన
116 మంది కోదాడలోని బ్యాంక్ ఆఫ్
ఇండియా శాఖలో కరెంట్ ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల ద్వారా ఒక యాప్‌ను ఉపయోగించి
ట్రేడింగ్ చేస్తూనే ఈ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇచ్చారు. ఇలా అద్దెకు ఇచ్చే ఖాతాలను మ్యూల్ ఖాతాలు అంటారు. ఈ ఖాతాలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయకుల ఖాతాలను డిజిటల్ అరెస్ట్ పేరుతో లూటీ చేశారు. ఇటీవల ఆపరేషన్ క్రాక్‌డౌన్ కార్యక్రమంలో
భాగంగా సైబర్ క్రైం పోలీసులు చేసిన తనిఖీలలో ఈ బ్యాంకులో ఖాతాలు తెరిచిన
116 మంది తమ ఖాతాలను కమీషన్‌కు ఆశపడినేరస్తులకు అద్దెకు ఇవ్వడం
ద్వారా 778 సైబర్ నేరాలు జరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు నిర్ధారించారు.
సైబర్ నేరాలకు అడ్డాగా కోదాడ
రాష్ట్ర వ్యాప్తంగా 454 మ్యూల్ ఖాతాలు
ఒక్క కోదాడలోనే 242 గుర్తింపు
1271 సైబర్ నేరాలతో సంబంధం
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో
వెలుగు చూసిన అక్రమాలు
37 కేసులు నమోదు చేశాం
కోదాడ పరిసరప్రాంతాలకు చెందిన వారు కోదాడ బ్యాంక్‌లలో ఖాతా లను ఓపెన్ చేసి ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు. దీనిపై నిఘా పెట్టి ఇటీవల తనిఖీలు చేశాం. అక్రమాలకు పాల్పడిన వారిపై 37 కేసులను నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశాం. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇస్తే తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. యువత తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
– శివశంకర్, కోదాడ పట్టణ సీఐ


