కోదాడ పబ్లిక్‌ క్లబ్‌ కార్యవర్గం ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

కోదాడ పబ్లిక్‌ క్లబ్‌ కార్యవర్గం ఏకగ్రీవం

Mar 28 2026 7:51 AM | Updated on Mar 28 2026 7:51 AM

అధ్యక్ష, కార్యదర్శులుగా కత్రం సీతారాంరెడ్డి, పోటు రంగారావు

కోదాడ : నెల రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపి, రెండుసార్లు వాయిదా పడిన కోదాడ పబ్లిక్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నికలు చివరకు ఏకగ్రీవంతో ముగిశాయి. శుక్రవారం రాత్రి క్లబ్‌ కార్యవర్గాన్ని ఎంపిక చేయడానికి నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ 2026–28 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారని, వీరు ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్నికల అధికారిగా నియమితులైన న్యాయవాది ఎస్‌ఆర్‌కె.మూర్తి క్లబ్‌ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అధ్యక్షుడిగా కత్రం సీతారాంరెడ్డి, క్యార్యదర్శిగా విశ్రాంత ఉపాధ్యాయుడు పోటు రంగారావును ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా తోట రంగారావు, గుండపనేని వెంకట సత్యనారాయణరావు, సంయుక్త కార్యదర్శులుగా వంగవేటి గురునాథం, కోటమర్తి విద్యాసాగర్‌రావు, కార్యవర్గ సభ్యులుగా తమ్మనబోయిన రామయ్య, అమరనాయిని శేషగిరిరావు, సుంకర సత్యనారాయణ, మేకల ప్రతాప్‌, ముండ్రా రవికుమార్‌, ఇర్ల నాగమునీంధర్‌రెడ్డి, కుక్కడపు వెంకటేశ్వర్లు(బాబు)లను ఎంపిక చేశారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి సహకరించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మినారాయణ మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, బొల్లం మల్లయ్యయాదవ్‌లకు ఐదుగురు కమిటీ సభ్యులు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, పి.సత్యబాబు, ఎం.పాండురంగారావు, వేనేపల్లి వెంకటయ్య, పార సీతయ్యలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement