ఫ వారబందీ విధానంలో ఇదే తుది విడత
అర్వపల్లి : చివరి విడత గోదావరి జలాలను శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం 5 తడులుగా గోదావరి జలాలను వదిలారు. 6వ తడిగా చివరి విడత శుక్రవారం విడుదల చేశారు. 1,333 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. వారబంధి విధానంలో వారం రోజులపాటు నీటిని సూర్యాపేట జిల్లాకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ విడతతో షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల పూర్తయినట్లు తెలిపారు.


