చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసమే జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని మాట్లాడారు. లోక్ అదాలత్‌లో పరిష్కారం చేసుకోవడం వల్ల స్నేహా పూర్వక వాతావరణం ఏర్పడుతుందని, ఇరువర్గాల వారు గెలిచిన వారు అవుతారన్నారు. ఒకసారి లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై అప్పీళ్లకు వేళ్లే అవకాశం ఉండదన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ కానిస్టేబుల్ కుటుంబానికి శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మంజూరు చేసిన రూ.కోటి 25లక్షల చెక్కు అందజేశారు. సూర్యాపేట జిల్లా కోర్టులో ఐదు బెంచీల ద్వారా నిర్వహించిన కేసుల్లో సివిల్, క్రిమినల్, బ్యాంకు, విద్యుత్, మోటర్ వెహికల్ యాక్టు, గృహ హింస మొత్తం 1849 కేసులు పరిష్కారమైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జీ ఎన్.అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి రాజు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద


