పుర కౌంటింగ్‌పై ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

పుర కౌంటింగ్‌పై ఉత్కంఠ

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

పుర క

పుర కౌంటింగ్‌పై ఉత్కంఠ

సూర్యాపేట టౌన్‌, భానుపురి : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలోని 141 వార్డులకు గాను 4 ఏకగ్రీవం కాగా 137 స్థానాలకు ఈ నెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్లు లెక్కించారు. ఫలితాల కోసం జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. అన్ని మున్సిపాలిటీల ఫలితాలు సజావుగానే వెల్లడి కాగా తిరుమలగిరి మున్సిపాలిటీలోని 10వ వార్డు విషయంలో వివాదం నెలకొంది. దీంతో కౌంటింగ్‌ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

కౌంటింగ్‌ ఇలా..

జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలోని రెండో అంతస్తులో సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల ఓట్లను లెక్కించారు. హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపును మొదటి అంతస్తులో చేపట్టారు. ప్రతి వార్డుకు ఒక టేబుల్‌ ఏర్పాటు చేసి మొదటగా పోస్టల్‌ బ్యాలెట్లు, ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను మొదటగా కట్టలు కట్టారు. ఆ తర్వాత పార్టీల వారీగా ఎన్నిఓట్లు పడ్డాయనేది బుట్టల్లో వేసి లెక్కించారు. ఒక్కో వార్డు ఓట్లను రెండు రౌండ్లలోనే లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది.

ఆది నుంచి కాంగ్రెస్‌దే ఆధిక్యం..

ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపులో తిరుమలగిరి మినహా అన్ని మున్సిపాలిటీల్లో మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగింది. తిరుమలగిరిలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం చూపింది. అక్కడి నుంచి ఏ మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడైనా తిరుగులేని విధంగా వార్డులను కై వసం చేసుకుంటూ దూసుకుపోయింది.

బీఆర్‌ఎస్‌ ఆందోళన..

తిరుమలగిరి మున్సిపల్‌ ఫలితాల వెల్లడిపై వివాదం నెలకొంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా 10 వార్డులను బీఆర్‌ఎస్‌, ఐదు వార్డులను కాంగ్రెస్‌ గెలిచినట్టు ఆర్‌ఓ ధ్రువీకరించారు. అయితే పదో వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన భూక్య యాకుబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితంపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రీ కౌంటింగ్‌ కోరగా మరోసారి లెక్కించి ఇదే ఫలితాలను ఆర్‌ఓ వెల్లడించారు. గెలిచిన పది మందికి గాను తొమ్మిది మందికే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి 10 వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌కు ఇవ్వకపోవడం, ఓడిపోయిన అభ్యర్థి రెండు గంటల తర్వాత రీ కౌంటింగ్‌ కోరడం ఏమిటని ఆ పార్టీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో అదనపు కలెక్టర్‌ కలుగజేసుకొని నిబంధనల మేరకు ఫలితాలు వెల్లడిస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని సర్థిచెప్పారు. చివరకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

కౌంటింగ్‌ వద్ద మూడంచెల భద్రత

ఎన్నికల ఫలితాల విషయంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా జిల్లా పోలీస్‌ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. కౌంటింగ్‌ వద్ద మూడంచెల భద్రత చేపట్టింది. కౌంటింగ్‌ జరిగే ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేసింది. ప్రత్యేక పాస్‌లు కలిగిన ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు, అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించారు. పటిష్ట బందోబస్తు కోసం 350 మంది పోలీస్‌ సిబ్బందితో పహారా కాశారు. కౌంటింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు, అడుగడుగన వీడియో గ్రాఫర్‌తో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చిత్రీకరించారు.

ఫ మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వెల్లడి

ఫ ఆది నుంచి ఆధిక్యం

ప్రదర్శించిన కాంగ్రెస్‌

ఫ కౌంటింగ్‌ కేంద్రం వద్ద

పటిష్ట బందోబస్తు

ఫ తిరుమలగిరి

10వ వార్డు ఫలితంపై వివాదం

పుర కౌంటింగ్‌పై ఉత్కంఠ1
1/1

పుర కౌంటింగ్‌పై ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement