పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి
– జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్
పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఎల్‌కేజీ నుంచి ఉన్నత స్థాయి విద్య అన్ని వర్గాల పిల్లలకు అందించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలన్నారు.


