ఆ ముగ్గరూ పోటీకి దూరం
కోదాడ : కోదాడ మున్సిపాలిటీకి చైర్‌పర్సన్‌లుగా పని చేసిన ముగ్గురు మహిళా నేతలు ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోమంటూ ప్రకటించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వంటిపులి అనిత, 2019లో బీఆర్‌ఎస్ నుంచి వనపర్తి శిరీష చైర్‌పర్సన్లుగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024లో చైర్‌పర్సన్‌గా ఎన్నికై న సామినేని ప్రమీల కూడా ఈ సారి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థులుగా కొత్తవారి పేర్లు వినవస్తున్నాయి.
తెరపైకి కొత్తవారి పేర్లు
కోదాడ మున్సిపాలిటీకి చైర్‌పర్సన్‌లుగా పని చేసిన వంటిపులి అనిత, వనపర్తి శిరీష తమ పదవీకాలం ముగిసిన తర్వాత హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఒక సంవత్సరం పాటు చైర్‌పర్సన్‌గా పని చేసిన సామినేని ప్రమీల వార్డు ప్రస్తుతం ఎస్టీకి రిజర్వుకావడంతో ఆమె పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్‌పర్సన్ రేస్‌లో నలుగురు కొత్తవారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వారు తమను ముందుగా చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తేనే పోటీలో ఉంటామని చెబుతున్నట్లు సమాచారం. పార్టీ పెద్దలు మాత్రం ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని, ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు.
ముందుగా ప్రకటించాలని కండీషన్
కోదాడ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో పలువురు నేతలు తమ సతీమణులను పోటీలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 12వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్, 14వ వార్డు నయానగర్‌కు చెందిన నాయకురాలితో పాటు ఇద్దరు కోదాడ మాజీ సర్పంచ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో 12వ వార్డు కౌన్సిలర్‌కు మాత్రమే వార్డు రిజర్వేషన్ కలిసి వచ్చింది. మిగతా వారు తమకు అనుకూల వార్డు కోసం వెతుకులాట సాగిస్తున్నారు. అయితే ఇతర వార్డుకు వెళ్లి పోటీ చేసి గెలువడం అంత సులభం కాదు కాబట్టి చైర్‌పర్సన్ అభ్యర్థిగా తమ పేరును ముందుగా ప్రకటిస్తేనే ముందుకు వెళతామని వారు చెబుతున్నట్లు సమాచారం.
గెలిచిన తరువాతే అంటున్న బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్‌లోనూ ఆశావహులు చాలా మంది ఉన్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తరువాతే చైర్‌పర్సన్ అభ్యర్థిని ప్రకటిస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మూడు రోజులుగా వార్డుల సమావేశాలను నిర్వహిస్తున్నారు. మొత్తం 35 వార్డులలో పోటీలో ఉంటామని, ఇప్పటికే 20 వార్డుల అభ్యర్థుల పేర్లు ఖాయమైనట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికారపార్టీ నుంచి టికెట్ రాక తమ వైపు వచ్చే బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ సారీ పోటీ చేయబోమని
మాజీ చైర్‌పర్సన్‌ల ప్రకటన
తెరపైకి కొత్తవారి పేర్లు
ముందస్తుగా హామీ ఇస్తేనే
పోటీ చేస్తా మంటున్న నేతలు


