ప్రపంచానికే ఆదర్శంగా యంగ్‌ ఇండియా విద్యాసంస్థలు | - | Sakshi
Sakshi News home page

ప్రపంచానికే ఆదర్శంగా యంగ్‌ ఇండియా విద్యాసంస్థలు

Jan 21 2026 7:33 AM | Updated on Jan 21 2026 7:33 AM

ప్రపంచానికే ఆదర్శంగా యంగ్‌ ఇండియా విద్యాసంస్థలు

ప్రపంచానికే ఆదర్శంగా యంగ్‌ ఇండియా విద్యాసంస్థలు

గరిడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రపంచానికే ఆదర్శంగా నిలువనున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి సమీపంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. రూ.200కోట్లతో చేపట్టిన పాఠశాల భవనాన్ని ఈ సంవత్సరం నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. 5.36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2500 మంది విద్యార్థులకు విద్య, వసతి అందించేలా అన్ని హంగులతో పాఠశాల, హాస్టల్‌, స్టాఫ్‌ క్వార్టర్స్‌ ఒకే చోట ఉండేలా భవనాన్ని నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియంతో పాటు సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విద్య మౌళిక సదుపాయాల కార్పొరేషన్‌ ఎండీ గణపతిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 79 నియోజకవర్గాలలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను మంజూరు చేశామని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలను పూర్తి చేసి అప్పగిస్తామని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ, పాఠశాల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బాల ప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, సీఐ చరమందరాజు, తహసీల్దార్‌ స్రవంతి, మాజీ ఎంపీపీ పైడిమర్రి రంగనాథ్‌, మాజీ జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు, సర్పంచులు ఉన్నారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement