నేడు 158 గ్రామ పంచాయతీల్లో పోలింగ్
రెండో విడత పోలింగ్ జరిగే మండలాలు
కోదాడ: జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల పరిధిలో మొత్తం 181 పంచాయతీలు, 1,628 వార్డులుండగా ఇప్పటికే 23 పంచాయతీలు, 339 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 158 పంచాయతీలు, 1,287 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 1,462 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఆయా మండల కేంద్రాల్లో సిబ్బందికి అధికారులు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయగా సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు.
కోదాడ నియోజకవర్గ పరిధిలో..
రెండో విడత ఎన్నికలు జరిగే 8 మండలాల్లో 6 మండలాలు కోదాడ, 2 మండలాలు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఏకగ్రీవ పంచాయతీలు, వార్డులు పోను మిగతా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అనంతగిరి మండలంలో మిగిలిన 17 పంచాయతీలు 139 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. చిలుకూరు మండలంలో 12 పంచాయతీలు, 114 వార్డులు, కోదాడ మండలంలో 14 పంచాయతీలు, 118 వార్డులు, మోతె మండలంలో 22 పంచాయతీలు, 193 వార్డులు, మునగాల మండలంలో 21 పంచాయతీలు, 192 వార్డులు, నడిగూడెం మండలంలో 13 గ్రామాలు, 124 వార్డులకు ఎన్నికలు జరగునున్నాయి.
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో..
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలంలో ఏకగ్రీవాలు పోను మిగిలిన 30 పంచాయతీలు, 181 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పెన్‌పహాడ్ మండలంలో 29 పంచాయతీలు, 226 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
258 సమస్యాత్మక
పోలింగ్ స్టేషన్‌లు
రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే 8 మండలాల పరిధిలోని 258 పోలింగ్ స్టేషన్‌లను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గట్టి బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది మండలాల పరిధిలో 25 గ్రామాల్లో 61 చోట్ల వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు.
287 ప్రదేశాలు..60 రూట్లు
ఎనిమిది మండలాల పరిధిలో రెండో విడత పంచాయతీ పోలింగ్‌కు అధికారులు 1,462 పోలింగ్ కేంద్రాలను 287 ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. దీనికోసం 60 రూట్‌లను 63 మంది రూట్ ఆఫీసర్స్‌ను నియమించారు. వీరంతా 125 బస్సులు, 35 కార్లలో ఎన్నికల సిబ్బంది, సామగ్రిని పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు శనివారం మధ్యాహ్నం నుంచి తరలించారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి స్టేజీ–1 ఆర్వోలుగా 57 మందిని, వ్యయపరిశీలకులుగా 08, స్టేజీ–2 ఆర్వోలుగా 175 మందిని, ఏఆర్వోలుగా 28 మందిని, జోనల్ అధికారులుగా 30 మందిని, సూక్ష్మ పరిశీలకులుగా 61 అధికారులను నియమించారు. ఎన్నికల కోసం 1,609 బ్యాలెట్ బాక్స్‌లను ఎన్నికల సిబ్బందికి అందించారు. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు కోసం 165 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఫ 1,287 వార్డుల్లో కూడా..
ఫ ఎనిమిది మండలాల్లో
1,462 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఫ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం
ఒంటిగంట వరకు..
ఫ 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. సాయంత్రం ఫలితాల వెల్లడి
ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
మండలం జీపీలు ఏకగ్రీవం ఎన్నికలు పోలింగ్ ఓటర్లు
జరిగేవి కేంద్రాలు
అనంతగిరి 20 03 17 156 24,294
చిలుకూరు 17 05 12 125 29,790
నడిగూడెం 16 03 13 128 22,862
మునగాల 22 01 21 202 35,945
కోదాడ 16 02 14 138 28,107
మోతె 29 07 22 213 31,907
చివ్వెంల 32 02 30 244 28,155
పెన్‌పహాడ్ 29 00 29 256 34,077
మొత్తం 181 23 158 1,462 2,35,137
నేడు 158 గ్రామ పంచాయతీల్లో పోలింగ్
నేడు 158 గ్రామ పంచాయతీల్లో పోలింగ్
నేడు 158 గ్రామ పంచాయతీల్లో పోలింగ్
నేడు 158 గ్రామ పంచాయతీల్లో పోలింగ్


