నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు
పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో (జేఎస్‌వీ) 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74.71 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. 80 సీట్లకు నిర్వహించిన పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 4,338 మంది విద్యార్థులకుగాను 3241 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. దీంతో ఒక్క సీటుకు 40 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా సాగిందని పేర్కొన్నారు.
సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి
పెన్‌పహాడ్ : ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. శనివారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఓలు, ఏపీఓలు పోలింగ్ సామగ్రిని, బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించి తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, మండల ప్రత్యేకాధికారి రాము, ఎంపీడీఓ జానయ్య, తహసీల్దార్ లాలు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల తనిఖీ
చివ్వెంల : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శనివారం రాత్రి ఏఎస్పీ రవీందర్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ మహేశ్వర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు
హుజూర్‌నగర్ : పట్టణంలోని శ్రీవేణుగోపాల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి వచ్చేనెల 16వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గుజ్జుల కొండారెడ్డి తెలిపారు. శనివారం హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రతిరోజూ సుప్రభాతం, ప్రాతకాలార్చన, విష్ణు సహస్రనామార్చన, గోదాష్టోత్తరం తదితర పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్స వం చేపట్టారు. ఆ తర్వాత కల్యాణం జరిపి స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు
నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు


