మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటాం
నూతనకల్ : మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. నూతనకల్ మండలంలోని లింగంపల్లిలో ఇటీవల హత్యకు గురైన ఉప్పుల మల్లయ్య కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. తుంగతుర్తిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పదేళ్ల పరిపాలనలో హత్యా రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, ఒంటెద్దు నర్సింహారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మున్న మల్లయ్య, రజాక్, లింగారెడ్డి, బిక్కి బుచ్చయ్య, మహేశ్వరం మల్లికార్జున్, బత్తుల సాయిలుగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకన్న పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
మాజీ మంత్రి కేటీఆర్


